
విశాఖ షిప్ యార్డులో (హిందూస్తాన్ షిప్ యార్డ్) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లోడ్ టెస్టింగ్ చేస్తున్నసమయంలో ఒక భారీ క్రేన్ బెర్త్‌పై కులిపోయింది. హటతుగా క్రేన్ విరిగిపడటంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయినట్లుగా తెలుస్తోంది, అంతేకాకుండా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటా హుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్సకి కావలసిన ఏర్పాట్లు చేసారు. క్రేన్ శిథిలాలను పక్కకు తొలగించి తగిన సహాయక చర్యలు కొనసాగిస్తునాటు అధికారులు ఎవ్లదించారు. క్రేన్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తేలుస్తుంది. ఘటన జరిగిన సమయంలో ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారన్నది క్లారిటీ రాలేదని తెలుస్తుంది. విరిగిపడిన క్రేన్ శకలకింద మరికొంతమంది ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ప్రమాదం జరిగింది అని తెలియగానే షిప్ యార్డు బయట ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న యార్డుల పనిచేస్తున్న సిబ్బంది బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడకు చెరుకోనగా ఆందోళన ప్రరిసతి చోటుచేసుకుంది. తమ వారు లోపల ఎలా ఉన్నారోననే భయాందోళన వ్యక్తం చేస్తున్నా షిప్ యార్డ్ సిబంది బంధువులు. మరోవైపు మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సబ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం చుట్టు భయానకంగా మారింది. అయితే, అధికారులు మాత్రం ఎవరినీ లోనికి అనుమతించటం లేదని చెబుతునారు.