- రిమ్స్ లో కరోనా పేషెంట్ లకు మెరుగైన వసతులు కల్పించాలి….కడపజిల్లా
జిల్లా covid-19 రిమ్స్ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ….. - రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా…..
పేషెంట్లకు మూడుపూటలా నాణ్యమైన భోజనం అందించాలి… - కరోనా మరణాలు పూర్తిగా తగ్గించాలి….
- కరోనా పేషెంట్ లందరికీ ఆక్సిజన్ తో కూడిన బేడ్ల (beds) వసతి కల్పించాలి….
కడప: -జిల్లా కోవిడ్-19 రిమ్స్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లకు మెరుగైన వసతులు కల్పించి జిల్లాలో కరోనా మరణాలు పూర్తిగా తగ్గించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్బాష పేర్కొన్నారు.
మంగళవారం ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎస్ బి. అంజాద్బాష జిల్లాcovid- 19 రిమ్స్ ఆస్పత్రి ని ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ దేవునిదయ.. కృపవల్ల నన్ను అభిమానించే నన్ను ప్రేమించే నా రాష్ట్ర ప్రజల దీవెనల వల్ల…. నన్ను ఎంతగానో అభిమానించే కడప నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలు వల్ల కరోనా ను జయించి బయటికి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
Covid -19 ఆస్పత్రులలో కరోనా పేషెంట్లకు మెరుగైన వసతులతో పాటు మంచి భోజనం అందించేందుకు అధిక నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. జిల్లా కోవిడ్-19 రిమ్స్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లకు మూడు పూటలా నాణ్యమైన ఆహారం, వార్డులలో మెరుగైన వసతులు సరిగా లేవన్నారు. కొన్ని రూములలో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని పేషెంట్లు తమకు తెలిపారన్నారు. ఈమధ్య రిమ్స్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ లకు మంచి వైద్యం, భోజన వసతి సరిగా లేదని తమ దృష్టికి రావడంతో నేడు రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందన్నారు.
ఇక నుంచి ప్రభుత్వ మెనూ ప్రకారం కరోనా పేషెంట్లకు భోజన వసతులు కల్పించాలన్నారు. మనది సీఎం జిల్లా ఇక్కడ పనిచేసే అధికారులందరూ బాగా పని చేసి పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించి కరోనా మరణాలు పూర్తిగా తగ్గించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనన్నారు. కరోనా పేషెంట్ లందరికీ ఆక్సిజన్ తో కూడిన బెడ్ల వసతి కల్పించేందుకు కోవిడ్-19 ఆస్పత్రిలో బెడ్ ల సంఖ్య పెంచడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో ఎక్కువ కరోనా టెస్ట్ లు చేయించి కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. కరోనా టెస్టులు ఎక్కువగా చేయడం వల్ల పాజిటివ్ కేసులు అధికంగా బయటపడుతున్నాయన్నారు. దీంతో ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేసి కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు.
ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జిల్లా పర్యటన ఉంటుందన్నారు. మంత్రివర్యులు ఆధ్వర్యంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా నివారణ పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ ప్రసాద్ రావు, ఆర్ ఎం వో కొండయ్య, మెడికల్ ఆఫీసర్ రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.