ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తాడంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను లారెన్స్ కొట్టిపారేశాడు.
లాక్ డౌన్ సమయంలో అమ్మ క్యాంటీన్ లో మూడు పూటలా ఉచిత భోజనం , వలస కార్మికులకు స్వస్థలానికి వెళ్లేందుకు ఆర్థిక సాయం మరియు సినీ కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ అంతేకాకుండా తన అనాథ ఆశ్రమం లో ఏమి లోటు లేకుండా చూసుకోవడం ,నడిగర్ సంఘము సభ్యులకు నగదు, సరుకులు ఇవ్వడం ఇదంతా చూసి రాజకీయ ప్రవేశం చేస్తాడని సోషల్ మీడియాలో పుకార్లు చేస్తున్నారు.
రాఘవ లారెన్స్ మానవ సేవ మాధవ సేవ అని ఇతరులకు సహాయం చేస్తున్నాను అని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.నేను ఎలాంటి రాజకీయ ప్రవేశం కానీ ఏ పార్టీ లో కానీ చేరనని చెప్పాడు. విరాళం ఇచ్చే దాతల వల్ల సహాయం చేస్తున్నానని చెప్పాడు.