CCMB
LATEST NEWS

మురుగు నీటిలోనూ కరోనా వైరస్‌ ఆనవాళ్లు గుర్తింపు

CCMB

హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ సీసీఎంబీ (CCMB) కీలక విషయాలను ఇటీవల వెల్లడించింది. కరోనా వైరస్‌ కేవలం ముక్కు, నోటి నుంచి వెలువడే స్రావాల ద్వారా మాత్రమే వ్యాప్తిచెందుతుంది అని మనకు తెలిసిన సమాచారం, కేవలం ముక్కు, నోటి నుంచి వెలువడే స్రావాల ద్వారా మాత్రమే కాకుండ  మురుగు నీటిలో వైరస్‌ ఆనవాళ్లు ఉంటాయని సీసీఎంబీ వెల్లడించింది. అయితే మురుగు నీటిలో వైరస్‌ ఉనికి గుర్తించినా ఇది వేరొకరికి సంక్రమించదని నివేదికలో స్పష్టం చేసింది. సీసీఎంబీతో (CCMB) కలిసి సీఎస్‌ఐర్ (CCIR) ఐఐసీటీ (IICT) తదితర సంస్ధలు చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 80 శాతం మురుగు నీటి కేంద్రాల్లో వైరస్‌ అవశేషాలు ఉన్నట్లు తాజాగా గుర్తించారు.

ఈ పరీక్షలన్ని సీసీఎంబీ (CCMB) కరోనా పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు. మరోవైపు ఈ పరీక్షలలో పాల్గొనడానికి ఐఐసీటీ నుండి మునుపాటి హేమలత, కొప్పెరి హరిశంకర్‌, వెంకట్‌ మోహన్‌, సీసీఎంబీ నుంచి ఉదయ్‌ కిరణ్‌, కుంచా సంతోష్ కుమార్‌, రాకేశ్‌ మిశ్రాలు పాల్గొన్నారు. వివిధ అధ్యయనాల చేయడం ద్వారానే వైరస్‌ మూలాలను కనుక్కోవచ్చని, తద్వారా వైరస్‌ నిరోధానికి ప్రణాళికలు రచించవచ్చని సీసీఎంబీ వెల్లడించింది.

Nimmakai Team
One-Stop-Shop for all latest NEWS, Entertainment, Lifestyle, Travel, Political updates, etc...
http://nimmakai.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *