
మరి కొద్ది రోజుల్లో ఐపీల్ ప్రారంభం కావడం నేపథ్యంలో ఈ ఐపీల్ లో డబుల్ సెంచరీ చేసే సత్తా ఒక ఆటగాడికి ఉంది అని మైక్ హస్సి చెప్పాడు.మరి హస్సి ఎవరి గురించి చెప్పాడు,డబుల్ సెంచరీ బాదే వీరుడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.కోల్ కత్తా కు ఆటగాడు andre russell వెన్నముక లాంటి వాడు.అతడు ఆడిన విద్వంసక ఇన్నింగ్స్ జట్టుకు ఎన్నో సార్లు ఉపయోగపడింది.
జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అతడిని మూడో స్థానంలో పంపిస్తే డబుల్ సెంచరీ చేసే అవకాశలు ఉన్నాయని అని పేర్కొన్నారు మైక్ హస్సి. అతడు ఒక 60 బంతులు ఎదురుకుంటే ఈ రికార్డు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.4 వ స్తానంలోనో లేదా 5 వ స్తానంలోనో బ్యాట్టింగ్ దిగితే అతడికి అన్ని బంతులు ఎదురుక్కోవడం అవకాశం దక్కుతుంది కాబట్టి russel ను మూడో స్థానంలో దింపితే అద్భుతాలు జరగడం ఖాయమని పేర్కొన్నాడు.
ఐపీల్ లో కాస్త లేటుగా వెలుగులోకి వచ్చిన స్టార్ అల్ రౌండర్ రస్సెల్ ,గత ఐపీల్ సీజన్లో 14 మ్యాచుల్లో 56.6 సగటుతో ఏకంగా 510 పరుగులు సాధించాడు. ఆడిన ప్రతి మ్యాచులో 200 పైగా స్ట్రిక్ రేట్ తో బీభత్సం సృష్టించాడు. మొత్తంగా 4 అర్ధ సెంచరీలు చేశాడు.ఇటీవలే జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో తన అల్ రౌండర్ తో దుమ్ము లేపాడు.
తక్కువ బంతుల్లో ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడలో రస్సెల్ ఏ మాత్రం భేదారడు .అలాగే ఎదురుదాడి చెయ్యడం అతని ప్రత్యేకత.ఎవ్వరు ఊహించని విదంగా మైక్ హస్సి అన్న మాటలు నిజం చేస్తాడా అనేది చూడాలి…..