
తెలుగు చిత్రంలో కరాటి కల్యాణి గా అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, బాబీ అంటూ ఓ పాత్రలో నటించిన ఆమెకి మంచి పేరు తీసుకువచ్చింది, ఈమెకు ఉన్న ఇమేజ్ కాస్త వేరుగా ఉంటుంది, ఇప్పుడు బిగ్‌బాస్ లోకి ఎంటర్ అయ్యి తన మనసులో మాటలు ప్రేక్షకులకు పంచుకుంది, కరాటే కల్యాణిలోని సున్నిత భావాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి.
బిగ్‌బాస్ వేదికపైకి వచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతూ..
నా పేరు కరాటే కల్యాణి,పుట్టింది శ్రీకాకుళం జిల్లా కవిటి. పెరిగింది విజయనగరం జిల్లాలో, చదువు అయితే అబ్బలేదు కానీ సంప్రదాయ కళలు మాత్రం అబ్బాయి,అయితే బాబీ అనే క్యారెక్టర్ విపరీతంగా జనాల్లోకి వెళ్లిపోయింది. కానీ నా క్యారెక్టర్ అది కాదు. కరాటే కల్యాణి స్క్రీన్ పేరు కాదు. నాకు తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ ఉంది. నేషనల్ లెవెల్లో నాలుగుసార్లు గోల్డ్ మెడల్ తీసుకొన్నాను అని కరాటే కల్యాణి తెలిపారు
నాకు జీవితంలో నాన్న అంటే చెప్పలేనంత ప్రేమ. నాన్న ద్వారా హరికథ చెప్పడం మొదలయింది, ఆ భావాలు నాలో కూడా వచ్చేసాయి, పెళ్లి అనేది కొంతమందికి అదృష్టం. కొందరికి దురదృష్టం,పెళ్లైన ప్రతీసారి కూడా ప్రెగ్నెన్సీ రావడం మిస్ అవ్వడం జరిగిపోతుంటుంది,
నాకు ఒక కోరిక ఉంది. నా సీమంతం జరగడం చూసుకోవాలనే కోరిక ఉంది. నేను గర్బవతి అయినప్పుడు పెద్దగా ఉండే నా పొట్టను చూసుకోవలనుకుంటున్నాను. కానీ నాకు ఎప్పుడూ ఆ కోరిక తీరలేదు. పెళ్లి నా జీవితానికి కలిసిరాలేదు. నన్ను అందరూ మోసం చేశారు. వాడుకోవడానికి చూశారే తప్ప. నా గురించి ఎవరూ నన్ను పట్టించుకోలేదు,
నా జీవితం చాలా నిస్పారంగా సాగుతున్న సమయంలో ఓ ఊరి నుంచి ఫోన్ వచ్చింది. ఓ బాబును కోళ్లగూట్లో పడేశారు. ఆ బాబుకు ఒంటినిండా చీమలు పట్టాయి. మీరు బాబును పెంచుకొంటానని చెప్పారు కదా.. వాళ్ల పోజిషన్ బాగాలేదు. ఆ బాబును మీరు పెంచుకొంటారా అని అడిగితే వాడిని తెచ్చుకొన్నాను,

నా చేతికి ఆ బాబు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడిని నా గుండెలపైనే పెంచుకొంటున్నాను. బిగ్‌బాస్‌లో ఉంటే.. నీవేంటో అద్దంలో చూసుకొన్నట్టుగా ఉంటుంది. అందుకే నేను బిగ్‌బాస్‌లోకి వచ్చాను. నేనేంటో జనాలకు చెప్పడానికి బిగ్‌బాస్ చక్కటి వేదికగా భావిస్తున్నాను అని కరాటే కళ్యాణి అన్నారు