chiranjeevi
ENTERTAINMENT

ఒకే సారి రెండు భారీ బడ్జెట్ సినిమాలు చేయనున్న మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi

చిరంజీవి తన సినిమాల గురించి అప్పటిలా కాకుండా డిఫరెంట్ గా ఆలోచిస్తూన్నాడు.తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక దాని తరువాత ఇంకొక సినిమాను వరుస లో ఉంచుతున్నాడు. తను ఏది చేసినా అది అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా తో చిరంజీవి బిజీగా ఉన్నారు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఆగిపోయింది. ఇంకా సగానికి పైగా పూర్తి చేయాల్సి ఉంది. కరోనా తీవ్రత తగ్గాక తొందరగా సినిమా పనులను పూర్తి చేయాలి అనుకుంటున్నారు.

చిరంజీవి రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకులు తన కోసం కథలు కూడా రెడీ చేసినట్లు సమాచారం. దీని గురించి తన పుట్టినరోజు వేడుకలో స్పెషల్ గా చెప్పనున్నట్లు తెలుస్తోంది.

మెహర్ రమేశ్ వేదళం రీమేక్ ని చిరంజీవి తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. వెంకీ మామ, పవర్, జై లవకుశ వంటి సినిమాలతో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకున్న బాబి ఈ మధ్య చిరూ తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అలాగే తను చెప్పిన పాయింట్ బాగా నచ్చడంతో చిరు బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది.

చిరు ఇ రెండు సినిమాలు ఒకేసారి చేయాలని అనుకోవడంతో 65 సంవత్సరాల వయసులో షూటింగ్స్ ని చాలెంజ్ గా స్వీకరించారు.ఈ సినిమాల రిలీజ్ లో కూడా అంత ఎక్కువ గ్యాప్ వుండదని చెప్తున్నారు. ఒకేసారి రెండు సినిమాలు గ్యాప్ లేకుండా చేయడం అంటే చిరు చాలా గ్రేట్ అంటున్నారు

Nimmakai Team
One-Stop-Shop for all latest NEWS, Entertainment, Lifestyle, Travel, Political updates, etc...
http://nimmakai.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *