LATEST NEWS

నిహారిక చేసిన పనికి నేను నా భార్య సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం

మెగాబ్రదర్ నాగబాబు కు అతని కూతురు నిహరిక కు మధ్య ఉన్న అన్యోన్యత గురించి అందరికీ తెలిసిందే. ఇక వీళ్ళిద్దరు టీవీ ఛానల్ లో చేసే సందడి అంతా ఇంతా కాదు. అలాగే నాగబాబు ఎన్నో ఇంటర్వ్యూలలో తన కుమార్తె పై ఉన్న ప్రేమ ను చెప్పేసారు,అలానే నిహారిక కూడా చాలా సమయాల్లో వాళ్ళ నాన్న గురించి చెప్పిందు,

ఈ మధ్యనే నిహారిక కు చైతన్య తో నిశ్చితార్థం అయింది. ఈ నేపథ్యంలో ‘జీ తెలుగు’లో బుట్ట బొమ్మ కు పెళ్ళంట ఈవెంట్ ద్వారా నాగబాబు నిహారిక తో పాల్గొన్నారు,ఈ ఈవెంట్ ను జీ తెలుగు, అదిరింది షో మెంబర్స్ కలిసి నిర్వహిస్తున్నారు. ‘బాపు బొమ్మకు పెళ్ళంట’ అనే ఈవెంట్ లో నిహారిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఈ మేరకు వారు విడుదల చేసిన ప్రోమో లువైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమో అయితే నాగబాబు తన కూతురు అంటే తనకి ఎంత ప్రేమో చెప్పడం జరిగింది.

ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక సంఘటనను  నాగబాబు బయట పెట్టాడు. నాగబాబు మాటల్లో “ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లాను. వాడెవడో నాలాగే నల్లకోటు వేసుకోవడంతో వాడిని నాన్న అనుకొని నిహారిక వాడితో వెళ్ళిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా లాభం లేకుండా పోగా నాకు బుర్ర పనిచేయదు. ఇక దేశంలో ఉన్న వాళ్లందరినీ చంపేద్దాం అన్నంత కోపం వచ్చింది. వరుణ్ ని ఇంటికి పంపించేసి నేను, పద్మ సూసైడ్ చేసుకుని చనిపోదాం అని అనుకున్నాం. నా కూతురు లేకపోతే నేను బతికి ఉన్నా కూడా వేస్ట్ అనిపించింది. నాకు తనంటే అంత పిచ్చి ప్రేమ. పుణ్యం చేసుకుంటేనే కడుపున ఇలాంటి ఏంజెల్స్ పుడతారు అని అంటారు. నాకు పుట్టిన ఏంజెల్ నా కూతురు నిహారిక,” అంటూ కూతురిపై ఎనలేని ప్రేమ కురిపించారు నాగబాబు.

Nimmakai Team
One-Stop-Shop for all latest NEWS, Entertainment, Lifestyle, Travel, Political updates, etc...
http://nimmakai.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *