ఏపీలో రానున్న మరో నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశం మెండుగా ఉందని వాతావరణ కేంద్రం వెళ్లడించారు. మరట్వాడ నుంచి ఉత్తర కర్ణాటక వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారుల వెళ్లడించారు. మరో వైపు దక్షిణ కోస్తాంధ్రను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి అని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక ఆగస్టు1 నుండి 4 వరకు రాయలసీమ, దక్షిణకోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెళ్లడించారు. ఇక ఆగస్టు 4న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతవరణ కేంద్రం తెలిపింది.