
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య సంచలనమే అనుకోవాలి బాలీవుడ్ లో, అసలు ఈ విషయంలో ఎం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం,
సుశాంత్ సింగ్ ఆత్మహత్య సమయంలో అతని తండ్రి సింగ్ తమకు ఎవరిపై అనుమానాలు లేవని చెప్పిన సింగ్, ఇప్పుడు పాట్నా పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేయటంతో ఒక్కసారిగా సంచలనం రేగింది.
పాట్నా సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్ సంజయ్ సింగ్ ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారు. సుశాంత్ ఆత్మహత్యకు రియా సాయం చేసిందంటూ తన కొడుకు చనిపోవడానికి కారణం కూడా రియానే అంటూ ఆయన సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. తన కొడుకుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తిగా రియా చూసుకుందని సుశాంత్ ఆత్మహత్యకు సరిగ్గా 6 రోజుల ముందు డబ్బు, నగలతో ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చాడు కేకే సింగ్. ఏడాది కాలంలోనే 15 కోట్ల వరకు రియా అకౌంట్కు సుశాంత్ నుంచి డబ్బులు వెళ్లాయని.. అతడి క్రెడిట్ కార్డులు, నగలు అన్నీ రియా తీసుకుందని ప్రముఖ జర్నలిస్ట్ మార్యా షకీల్ కూడా ట్వీట్ చేసారు. రియాపైనే సుశాంత్ తండ్రి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఈ కేసు మరింత సంచలనం రేపింది.