
శృతి అంటే ఎవరు గుర్తు పట్టకపోవచ్చు కానీ , జోర్డార్ సుజాత అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు.పూర్తిగా పల్లెటూరిలోనే పెరిగిన సుజాత. సుజాత 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూలో చదివింది. హయ్యర్ స్టడీస్ పూర్తి అయిన తరువాత,ఆన్లైన్ మార్కెటింగ్ లో జాబ్ చేసింది.
తెలంగాణ యాసలో ఒకసారి ప్రోగ్రాం వస్తుందిఅని ఒక్కసారి ట్ర్య్ చేద్దామని ఆడిసెన్సు కి వెళ్లిన శృతి మాటల తీరు నచ్చడంతో ఆమెను సెలెక్ట్ చేశారు.అలా తీన్మార్ వార్తల తో సుజాతగా అందరికి దగ్గరయ్యింది.ఆ తరువాత వేరే ఛానెల్స్ లో యాంకర్ గా పని చేసింది.తాజాగా బిగ్ బాస్ 4 లో అడుగుపెట్టిన జోర్డార్ సుజాత అన్ని ఆటంకాలు దాటుకుని వచ్చా అని చెప్పుతోంది.
మంచిగా అనిపిస్తే మంచిగా మాట్లాడుతాను,కోపం వస్తే బొక్కలు ఇరగొడుతాను అని అనింది.వచ్చి రాగానే నాగార్జున ను బిట్టు అని జోర్డార్ గా మాట్లాడింది.సుజాత అలాగే యాసతో బిగ్ బాస్4 లో అలరిస్తుందా ,లేదా అనేది చూడాలి ..