Thaman, copy cat
ENTERTAINMENT

మరో సారి అడ్డంగా బుక్ అయిన థమన్

Thaman, copy cat

తెలుగు ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకరు, తన డిఫరెంట్ మ్యూజిక్ తో ఆడియాన్స్ లో తనకంటూ మంచి ముద్ర వేసుకున్న థమన్ కి కాపీ క్యాట్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంటుంది, తాజాగా వి సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోను కాపీ ఆరోపణలు థమన్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిజానికి, వి చిత్రం మ్యూజిక్ డైరెక్టర్‌గా అమిత్ త్రివేది పని చేశారు. అయితే వేరే కమిట్ మెంట్స్ ఉండటంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థమన్ ఇచ్చారు

వి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే సినిమాల నుండి కాపీ కొట్టాడని సోషల్ మీడియాలో మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ‘వి’ బీజీఎమ్ తమిళ్ ‘రాచ్చసన్’ (తెలుగు ‘రాక్షసుడు’) ని పోలి ఉందని అంటుండగా, క్లైమాక్స్ కి ముందు వచ్చే సీక్వెన్స్ లో తమిళ్ ‘అసురన్’ బ్యాగ్రౌండ్ స్కోర్ వాడాడని కామెంట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *