చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టి రెండు రోజులు తీవ్రంగా శ్రమిస్తుంది. తాజాగా ఆ జట్టు అల్ రౌండర్ డ్వెనే బ్రేవో ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూలో ప్రాక్టీస్ కి సంబంధించిన అలాగే భవిష్యత్ కు సంబంధించిన చెన్నై కెప్టెన్ గురించి ధోని ఏమని ఆలోచిస్తున్నాడో అనే విషయనికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
బ్రేవో మాట్లాడుతూ ఏమన్నాడంటే చెన్నై జట్టులో మరోసారి ఆడటం చాలా సంతోషంగా ఉంది.ధోనీ తో కలిసి ఆడటం మాపై ఒత్తిడిని తాగ్గిఇస్తుంది.ఆ జట్టు యాజమాన్యం కూడా కుంటుంబ సభ్యులు గా భావిస్తుంది. ఇక చెన్నై తదుపరి కెప్టెన్ విషయానికి వస్తే ఎప్పుడో ఒకసారి కెప్టెన్ బాధ్యతల నుండి తప్పు కోవాలని ధోని కూడా తెలుసు.తరువాత చెన్నై కెప్టెన్ వారసుడిని ధోని ఎప్పటి నుండో ఆలోచన చేస్తున్నారు.
రైనా లేదా ఇంకా ఎవరైనా యువ ఆటగాడికి నాయకత్వం బాధ్యతను అప్పచెప్పాలని చూస్తున్నాడు. ధోని ఉండగానే ఇంకో కెప్టెన్ ని సిద్ధం చెయ్యాలని అనుకుంటున్నాడు.ఇక ఈ ఐపీల్ కి వస్తే మా జట్టలో ఆటగాళ్లందారికి టాలెంట్ ఉంది.జట్టు యజమాన్యం కూడా మాకు సహకరిస్తుంది ,ఎప్పుడు ఒత్తిడి పెట్టలేదు.
ముఖ్క్యంగా ధోనీ లాంటి కెప్టెన్ ఉన్నప్పుడు ఒత్తిడికి తావు లేదు. Csk తదుపరి కెప్టెన్ గురించి బ్రేవో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయింది.