మన చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి రేపు 65వ వసంతంలోకి అడుగుపెట్టనున్న సంగతి మనఅందరికి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు, సెలబ్రిటీలు, ఇండస్ట్రీ, కుటుంబ సభ్యులు అనేక సర్ప్రైజ్లు ప్లాన్ చేశారు. సాయంత్రం చిరు కామన్ బర్త్‌డే డీపీని విడుదల చేస్తారు. కొద్ది సేపటి క్రితం జాంబీ రెడ్డి టీం చిరంజీవి బర్త్‌డే సందర్భంగా సర్ప్రైజ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో నాట్యమండలి స్టేజ్, గద పట్టుకొని చిరు కనిపిస్తున్నారు. మెగాస్టార్‌కి ఇది అంకితం చేస్తున్నామంటూ టీం వెళ్లడించారు. 23వ తేదీన ఉదయం 10గం.లకి డేర్ డెవిల్ పూర్తి వీడియో విడుదల చేయనున్నారు అని తెలియజేశారు.
హారర్, థ్రిల్లింగ్, గ్రాఫిక్స్ అంశాలతో సాగే జాంబీ చిత్రాలు ప్రేక్షకులకు ఓ వినూత్నమైన అనుభూతిని కలిగిస్తాయి అని వివరించారు.
ఈ తరహాలో తెలుగులో రాబోతున్న మొట్టమొదటి జాంబీ చిత్రం ‘జాంబీరెడ్డి’. ఈ చిత్రానికి ప్రశాంత్‌వర్మ దర్శకుడు (‘అ!’ ‘కల్కి’ఫేమ్).ఈ సినిమాను నిజ జీవిత సంఘటనల్ని ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నారు అని వెళ్లడించారు. సరికొత్త విజన్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు అని దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెలిపారు. అత్యున్నత సాంకేతికాంశాలతో ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. కరోనాకు, జాంబీరెడ్డికి ఉన్న సంబంధం ఏమిటనే అంశం సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పారు. గ్రాఫిక్స్, యానిమేషన్, విజువల్స్ ప్రేక్షకులకు గొప్ప అనుభూతినందిస్తాయి అని చిత్ర యూనిట్ చెబుతున్నారు.